Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం మూవీస్ రిలీజ్ రివ్యూ... రాజ్ తరుణ్ వర్సెస్ మంచు లక్ష్మీ

ప్రతి తరహాలోనే ఈ శుక్రవారం (జూలై 20వ తేది) కూడా నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఇవి చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలే. గతవారంలో మూడు సినిమాలు విడులయ్యాయి. ఈ వారం నాలుగు చిత్రాలు విడుదల కా

Webdunia
గురువారం, 19 జులై 2018 (14:17 IST)
ప్రతి తరహాలోనే ఈ శుక్రవారం (జూలై 20వ తేది) కూడా నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఇవి చిన్న, మధ్యతరహా బడ్జెట్ చిత్రాలే. గతవారంలో మూడు సినిమాలు విడులయ్యాయి. ఈ వారం నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. గత వారం విడుదలైన చిత్రాల్లో 'విజేత', 'చిన్నబాబు' యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. మూడో చిత్రం "ఆర్ఎక్స్ 100". ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో రూ.10 కోట్ల మేరకు వసూలు చేసినట్టు సమాచారం.
 
ఈ చిత్రంలో నటించిన కుర్ర హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అందాలకు యువత ఫిదా అయిపోయారు. ఫలితంగా వారంతా ఆమె అందాలను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ చిత్రం ఆడుతున్న థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. 
 
ఇకపోతే, ఈ శుక్రవారం విడుదల కానున్న నాలుగు చిత్రాల గురించి విశ్లేషిస్తే, ఈ నాలుగు చిత్రాల్లో మొదటగా చెప్పుకోవలసిన సినిమా "లవర్". రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. చిన్న బడ్జెట్‌తో "ఫిదా"లాంటి అందమైన క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. ఫలితంగానే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. 
 
ఆ తర్వాత చెప్పుకోదగిన చిత్రం మంచులక్ష్మీ "వైఫ్ ఆఫ్ రామ్". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న సినిమా. థ్రిల్లర్ కాబట్టి తప్పకుండా ఆకట్టుకుంటుందనే ధీమాను దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం విడుదల కాబోయే మూడో సినిమా "ఆటగదరా శివ". ఉరిశిక్ష పడిన ఖైదీకి.. ఉరి తీయబోయే తలారి మధ్య జరిగే కథే ఇది. టైటిల్‌తో పాటు కంటెంట్ కూడా డిఫరెంట్‌గా ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, ఎన్టీఆర్ వంటి నటులు ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటంతో.. సినిమాపై భారీ అంచనాలు నలకొన్నాయి. 
 
ఈ మూడు చిత్రాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. శనివారం రోజున "పరిచయం" అనే ప్రేమకథా చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో బట్టలు ఊడదీసుకునే ప్రేమ ఉండదు. ప్రేమ యొక్క గొప్పదనాన్ని, మాధుర్యాన్ని తెలియజేసే సినిమా అని దర్శకుడు చెప్పడంతో.. ఆసక్తి కలిగిస్తోంది. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయో వేచిచూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments