Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ హౌస్‌లో దోమలా..? లాస్య ఏం చెప్పింది..?

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (16:07 IST)
బిగ్ బాస్ హౌస్ గురించి కంటిస్టెంట్, యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 4 ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా అభిజీత్ నిలవగా.. అఖిల్ రన్నర్‌గా మిగిలారు. కాగా ఈ సీజన్‌లో ప్రముఖ యాంకర్ లాస్య మంజునాథ్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

11 వారంలో ఆమె హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. కాగా ఇటీవల లాస్య ఓ వీడియోను విడుదల చేసింది. అందులో హౌజ్‌లో నుంచి వచ్చిన తరువాత తనకు ఎదురైన ప్రశ్నలకు లాస్య సమాధానం ఇచ్చింది. ఈ వీడియోను తన కుటుంబ సభ్యులతో కలిసి లాస్య చేసింది. వారు ఒక్కో ప్రశ్నను వేస్తుండగా.. వాటికి లాస్య ఆన్సర్ చెప్పింది.
 
మొదటగా లాస్య అన్న కూతురు మాట్లాడుతూ.. అత్త బిగ్‌బాస్ హౌజ్‌లో దోమలుంటాయా..? అని ప్రశ్నించగా.. ఎందుకుండవు. అది కూడా హౌజ్ కదా. కానీ డోర్లు బాగా వేయడం వలన లోపలికి వచ్చేవి కాదు గానీ.. గార్డెన్ ఏరియాలో కూర్చున్నప్పుడు దోమలు మమ్మల్ని కుట్టేవి అని చెప్పింది. ఇక మంజునాథ్ అమ్మమ్మ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఎక్కడ కూర్చొని మాట్లాడుతాడు..? అన్న ప్రశ్నకు.. దీనికి సమాధానం మాకు కూడా తెలీదు. ఎక్కడి నుంచో వాయిస్ వస్తుంటుంది. అయితే కన్ఫెషన్ రూమ్ పక్కన ఒక చిన్న రూమ్‌లో ఉంటాడని మేము అనుకునేవాళ్లం అని చెప్పింది. 
 
ఇక రాత్రి మిగిలిన అన్నాన్ని ఏం చేస్తారు..? అన్న ప్రశ్నకు.. ఇంట్లో లాగానే పులుసన్నం, ఎగ్ ఫ్రైడ్ రైస్‌, టమాటో రైస్ అలా చేసేదాన్ని. కానీ పొద్దుపొద్దునే రైస్ తినేందుకు ఎవ్వరూ ఇష్టపడేవాళ్లు కాదు. అందులో చల్లగా అయిన అన్నంను ఎవరూ తినేవారు కాదు అని చెప్పింది. ఇక వేకప్ సాంగ్ గురించి లాస్య మరదలు ప్రశ్నించగా.. ఎవరు ప్లే చేస్తారో నాకు తెలీదు. డైరెక్షన్ టీమ్‌లో ఎవరో ఒకరు అని అనుకునేవాళ్లం. 
 
మేము ఉండేది చెక్కతో తయారు చేసిన ఇంట్లో కాబట్టి.. బయట నుంచి చిన్న చిన్నగా శబ్దాలు వినిపించేవి. అవి క్లారిటీగా ఉండేవి కాదు అని సమాధానం ఇచ్చింది. ఇక ఉదయం వేసే పాటలను బట్టే మీ డే ఎలా ఉండబోతోందో తెలిసేదా..? అని మంజునాథ్ ప్రశ్నించగా.. ఒక్కోసారి అనిపించేది అని తెలిపింది. ఇక అక్కడ నీళ్లతో ఏదైనా ఇబ్బంది ఉండేదా..? అన్న ప్రశ్నకు.. ఏదో టాస్క్‌ల కోసం మినహాయిస్తే తమకు ఎప్పుడూ నీళ్లతో ఇబ్బంది రాలేదని చెప్పింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments