Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానికి షాక్ ఇచ్చిన లారెన్స్..!

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (18:43 IST)
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం జెర్సీ. మ‌ళ్లీ రావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన‌ జెర్సీ చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసింది. అయితే... ఏప్రిల్ 19నే కాంచ‌న 3 సినిమాని రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన లారెన్స్ నానికి షాక్ ఇచ్చారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ్‌లో రిలీజ్ కానుంది. దీంతో నాని సోలో రిలీజ్ ఛాన్స్‌కి కాంచ‌న 3 బ్రేక్ వేసిందని చెప్ప‌చ్చు. 
 
రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన హ‌ర్ర‌ర్ మూవీస్‌కి బి, సి సెంట‌ర్స్‌లో మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తుంటాయి. ఇది నాని జెర్సీకి గ‌ట్టి దెబ్బే.  మ‌రి.. ఎందుకు నానికి పోటీగా ఈ సినిమా రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు అని కాంచ‌న 3 టీమ్‌ని అడిగితే... నాని జెర్సీ మే 1కి వాయిదా వేసే అవ‌కాశాలు ఉన్నాయి. అందుచేత‌నే కాంచ‌న 3 చిత్రాన్ని ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నామ‌ని కాంచ‌న 3 టీమ్ చెబుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఒకవేళ జెర్సీ రిలీజ్ వాయిదా ప‌డ‌క‌పోతే కాంచ‌న 3 రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మ‌రి... ఈ బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రు త‌గ్గుతారో.. ఎవ‌రు విన్న‌ర్‌గా నిలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments