Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న నన్ను ఎదగనివ్వలేదు: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

సెల్వి
శుక్రవారం, 21 జూన్ 2024 (18:01 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె నటిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే హోస్ట్‌గా కొన్ని టాక్ షోలు చేశారు. కానీ ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా నటించాలనే ఆమె కోరిక నెరవేరలేదు. 
 
అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం ఆమె రాణిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల కోసం ఆమె వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి నటుడు మోహన్ బాబుపై మంచు లక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తాను నటి కావడం తన తండ్రికి ఇష్టం లేదని ఆమె చెప్పింది. 
 
"సౌత్‌లో హీరోల కూతుళ్లకు, సిస్టర్స్‌కి అవకాశాలు ఇవ్వరు. నేను నటి కావడం నాన్నకు కూడా ఇష్టం లేదు. నా ఇద్దరు బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే. ఈ ధోరణి సౌత్ లోనే కాదు, దేశమంతా ఉంది.." అని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తాను హైద‌రాబాద్ వ‌దిలి ముంబై వ‌చ్చేందుకు త‌న కుటుంబం ఓ అడ్డంకిలా మారింద‌ని మంచు ల‌క్ష్మి తెలిపింది. తనను ముంబై పంపించాలంటే ఇంట్లో వాళ్లు సంకోచించారు. ముంబైకి వ‌చ్చిన కొత్త‌లో తన బెస్ట్ ఫ్రెండ్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉండేదాన్ని అని ఆమె చెప్పింది.
 
ర‌కుల్ ముంబై వ‌చ్చేయ్ అని త‌ర‌చుగా చెప్పేద‌ని, ఇక రానా సైతం ఎప్ప‌టికీ హైద‌రాబాద్‌లోనే ఉండిపోకూడ‌ద‌ని చెప్పాడు. దీంతో ఏదైనా కొత్త‌గా ట్రై చేద్దామ‌ని ముంబై వ‌చ్చిన‌ట్లు మంచు లక్ష్మి చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments