Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌కు జోడీగా కృతిశెట్టి

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (18:51 IST)
Kritisetty ph
ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా  తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్  చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న `ఉప్పెన‌` ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపోందుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో అల్ట్రా మాస్ చిత్రంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments