Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.. అంతగా దిగజారడు: కృష్ణవంశీ

గ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు పూరీని విచారించడంపై డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ… పూరీ వ్యవహారాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులోంచి పూరీ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (11:56 IST)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణ ఎదుర్కొన్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పైసా వసూల్ ప్రమోషన్‌లో బిజీగా వున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ, పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బాలకృష్ణగారికి అభిమాన సంఘం ఉంటే నేనే దానికి అధ్యక్షుణ్ని అవుతానని పూరీ జగన్నాథ్ అన్నారు. బాలయ్యతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. 
 
ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు పూరీని విచారించడంపై డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ… పూరీ వ్యవహారాన్ని మొత్తం చిత్ర పరిశ్రమకు ముడిపెట్టడం సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులోంచి పూరీ క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారన్నారు. పూరీ వ్యక్తిత్వమేమిటో తనకు బాగా తెలుసునని, ఆయన అంత దిగజారడన్నారు.
 
పూరీ జగన్నాథ్ సమాజాన్ని ఉపయోగపడే మంచి సందేశాత్మకమైన చిత్రాలను అందించారని కృష్ణవంశీ గుర్తు చేశారు. ఇక కృష్ణవంశీ తాజా చిత్రం ‘నక్షత్రం’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంతో కృష్ణవంశీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. నక్షత్రంలో సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్, తనీష్ తదితరులు నటించారు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments