Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ ఆవిష్క‌రించిన కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (17:45 IST)
Gopichand, Koteshwara Rao gari kodukulu teaser
అభినవ్, సత్య మణి హీరోలుగా నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న చిత్రం " కోటేశ్వరరావు గారి కొడుకులు". (మోస్ట్ డేంజరస్ వేపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ) అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో ప్రియాంక డి, చందన హీరోయిన్లుగా నటిస్తుండగా.. వశిష్ట్ నారాయణ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌‌ని మ్యాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు గోపీచంద్. ఈ మేరకు యూనిట్ సభ్యులను అభినందించారు. 
 
టీజర్ విషయానికొస్తే.. 2 నిమిషాల 3 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ 'మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం ఖచ్చితంగా మనీ అయి ఉంటది' అనే రియలిస్టిక్ డైలాగ్‌తో ప్రారంభమై ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మనీ కెన్ డు ఎనీథింగ్.. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అంటూ మోడ్రన్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్‌గా మారింది. 
 
మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇదని, తండ్రీ కొడుకుల మధ్య మనీ మ్యాటర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకునే తండ్రి కల నెరవేరిందా? అదేవిధంగా తండ్రిని కోటీశ్వరుడు చేయాలనుకునే ఆ కొడుకుల ప్రయత్నం ఫలించిందా? అనే డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments