Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు దణ్ణం పెడతా.. నేను ఆరోగ్యంగా బతికే ఉన్నా.. కోట శ్రీనివాసరావు

నాకు 70 యేళ్ళు.. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా. ఇప్పటికీ 8 సినిమాలు నా చేతిలో ఉన్నాయి. నన్ను ఇప్పుడే చంపేయొద్దు. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా పనులు నేను చేసుకుంటున్నాను. షూటింగ్‌కు వెళ్ళి వస్తున్నాను. అనవసరంగా కొంతమంది నాపై తప్పుడు వార్తలు రాస్త

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (14:13 IST)
నాకు 70 యేళ్ళు.. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా. ఇప్పటికీ 8 సినిమాలు నా చేతిలో ఉన్నాయి. నన్ను ఇప్పుడే చంపేయొద్దు. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా పనులు నేను చేసుకుంటున్నాను. షూటింగ్‌కు వెళ్ళి వస్తున్నాను. అనవసరంగా కొంతమంది నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కోట శ్రీనివాసులు చనిపోయారు. ఆయన మనకిక లేరు అని. నాకు ఈ వార్తలు బాధను తెప్పిస్తున్నాయి. ఇలాంటివి ఇప్పటికైనా మానుకోండి. 
 
40 యేళ్ళ పాటు సినీ పరిశ్రమలకు సేవ చేశా.. ఇంకా సేవ చేసే సత్తా నాలో ఉంది. తాజాగా జవాన్, బాలక్రిష్ణుడు సినిమాల్లో నటించా. ఇంకా మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. నేను ఆసుపత్రికి వెళ్ళి అత్యవసర విభాగంలో అస్సలు చికిత్స చేయించుకోలేదు. ఇంటిలోనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగుంది అంటూ కోట శ్రీనివాసులు కొన్ని సామాజిక మాధ్యమాలపై ఆగ్రహంతో ఊగిపోయారు. పబ్లిసిటీ కోసం కొన్ని సామాజిక మాధ్యమాలు నేను చనిపోయినట్లు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు కోట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments