Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సిన కొరటాల.. బన్నీతో కమిట్ అయ్యాడు ఎందుకు?

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (14:00 IST)
శ్రీమంతుడు సినిమాకు తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో చేయాల్సింది. అయితే ఎన్టీఆర్‌తో కాకుండా బన్నీ సినిమాకు కమిట్ అవడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. బన్నీతో సినిమా చేసేందుకు ఇప్పటికే దర్శకుడికి అడ్వాన్స్‌లు కూడా అందించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ బిజీగా ఉండటం వల్ల.. కొత్త ప్రాజెక్టును బన్నీతో కొరటాల శివ చేస్తున్నాడని టాక్ వచ్చినా.. బన్నీ కూడా బోయపాటి సినిమాతో బిజిగానే ఉన్నాడని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి రెండు వరుస విజయాలు అందుకున్న దర్శకుడిని తమవైపుకు తిప్పుకోవడంలో మెగా క్యాంప్ సక్సెస్ సాధించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కొరటాలపై కోపంగా ఉన్నారు. శ్రీమంతుడు సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించడంతో కొరటాల శివ పేరు మారుమోగిపోతోంది. ఈ టైమ్‌లో ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఆశించిన ఫ్యాన్స్‌కు కొరటాల బన్నీతో సినిమా చేస్తుండటం కాస్త నిరాశనే మిగిల్చింది. 
 
నిజానికి మహేశ్ బాబు సినిమా కంటే ముందే ఎన్టీఆర్‌తో కొరటాల శివ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ.. ఎన్టీఆర్ ఆల్రెడీ అంగీకరించిన సినిమాలు క్యూలో ఉండడంతో.. ఈలోపు మహేశ్ తో శ్రీమంతుడు సినిమా చేశాడు. ఈ లెక్కన తన నెక్స్ట్ మూవీగా ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సిన కొరటాల.. మెగా హీరో బన్నీతో కమిట్ అయ్యాడు. మరి దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొరటాల ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments