Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ అభిమానిగా "కొంటె కుర్రాడు" చిత్రం ప్రారంభం

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (22:16 IST)
శ్రీ రామ రక్ష ఫిలిమ్స్, స్మైలింగ్ డ్రీమ్స్,సంస్థలు సంయుక్తంగా సాగర్ యమ్ యన్ వి, వెన్నెల విహర్ హీరోహీరోయిన్లుగా, సాగర్ యమ్‌యన్‌వి దర్శకత్వంలో ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ (సిద్దు) నిర్మిస్థున మాస్ ఎంటర్టైనర్ "కొంటె కుర్రాడు". ఓ లోఫర్ గాడి ప్రేమ కథ ట్యాగ్ లైన్. ఇటీవలె రాజ్ కందుకూరి ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. హీరో రవితేజ అమర్ అక్బర్ అంథోని చిత్రం విడుదల సందర్భముగా ఓ ప్రత్యేక పాటను ఈ చిత్ర యూనిట్ రవితేజ‌కు డెడికేట్ చేశారు. 
 
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మా హీరో దర్శకుడు సాగర్ మాస్ మహా రాజ్ రవితేజకి వీరాభిమాని. శుక్రవారం రవితేజ నటించిన "అమర్ అక్బర్ అంథోని" సినిమా విడుదల సందర్భంగా మా చిత్ర సంగీత దర్శకుడు యస్ ఏ అరమాన్ రచించిన, ప్రముఖ గాయకుడు రాంకి ఆలపించిన ఒక స్పెషల్ సాంగ్‌ని మాస్ మహా రాజ్‌కి డెడికేట్ చేస్తూ, కుకట్ పల్లి వసంత నగర్‌లో "అరుణ ప్రియ హోల్డ్ ఏజ్ హోమ్ "వృద్ధుల మధ్య విడుదల చేశాము. సాగర్ ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు‌. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని అన్నారు.
 
మాస్ లవ్ ఎంటర్టైనర్‌గా తీస్తొన్న ఈ సినిమాలో తాను రవితేజ గారి అభిమానిగా కనిపిస్తానని, సస్పెన్స్ లవ్‌తో ఎవరు ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని, మరో హీరొయిన్ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతుందని హీరో, దర్శకుడు సాగర్ అన్నారు. 
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రవీణ్. కె కావలి, మ్యూజిక్: యస్.ఏ. అరమాన్, ఎడిటింగ్: మహేశ్, పోస్టర్ డిజైనింగ్: జగదీష్ కుమార్, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: సాగర్ యమ్ యన్ వి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments