కథే హీరోగా కాఫీ విత్ ఏ కిల్లర్ - ఓటిటి లోనే చేయాలని పట్టు పట్టా : ఆర్ పి పట్నాయక్

డీవీ
శుక్రవారం, 31 జనవరి 2025 (16:53 IST)
RP Patnaik, Seven Hills Satish and others
ఆర్ పి పట్నాయక్ కథ రచనా దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మాతగా ఆహా ఓటిటిలో నేటి నుండి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్న చిత్రం "కాఫీ విత్ ఏ కిల్లర్". టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప, జెమిని సురేష్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం క్రైమ్ జోనర్ లా అనిపిస్తుంది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి డిఓపి, ఎడిటర్, డిఐ గా వ్యవహరించగా తిరుమల  డైలాగులు రాశారు. నేటి నుండి ఆహాలో స్క్రీన్ స్ట్రీమ్ కానుంది.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్ పి పట్నాయక్ మాట్లాడుతూ, హీరో హీరోయిన్ లేకుండా ఒక సినిమా తీయాలి అంటే ఎలా అని ఆలోచనతో ఈ కథ మొదలైంది. కథ హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఈ కథ రాశాము. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాను మొత్తం దగ్గరుండి చూసుకున్నది మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్. ఈ చిత్రంలోని కీలక పాత్ర విషయానికి వస్తే నాకు వంశీ మాత్రమే కచ్చితంగా ఈ కథకు, పాత్రకు పర్ఫెక్ట్ అని అనిపించింది. వేరే ఎవరిని నేను ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. జెమిని సురేష్ క్యారెక్టర్ ప్రత్యేకమైనది. నా ఆలోచనలు అర్థం చేసుకునే తిరుమల నాగ్ కలిసి ఈ చిత్రం కోసం పని చేశాను. 
 
డిఓపి అనూష్ ఎంతో సౌమ్యుడు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. చిత్రంలో నటించిన నటీనటుల క్యారెక్టర్లు చూస్తే కొన్ని ఎంతో ప్రత్యేకంగా అలాగే కొత్తగా ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఆయన కాకుండా ఇంకా ఎవరు అంత బాగా చేయలేరు అన్నట్లు వచ్చింది. ఆయన టైమింగ్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఈ చిత్రం ఎంతో శ్రద్ధగా టీమ్ అంతా కలిసి టీం వర్క్ గా చేసాము. సినిమాలో హీరో హీరోయిన్ ఉండరు కానీ విలన్ ఉంటాడు. ఈ సినిమాను ఎంతోమంది థియేటర్లో విడుదల చేయమని నన్ను అడిగారు కానీ నేను ఈ సినిమా ఖచ్చితంగా ఓటిటి లోనే విడుదల కావాలి అని పట్టు పట్టి ఆహాలో విడుదల చేస్తున్నాము. నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన త్వరలోనే పెద్ద నిర్మాతల స్థాయికి చేరతారు. మా డైరెక్షన్ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ ఎంతో కష్టపడి పని చేశారు. చివరిగా యాంకర్ గీతా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె మా రైటింగ్ టీమ్ లో కూడా ఉంటారు" అంటూ ముగించారు.
 
ఇంకా  నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్, నటుడు టెంపర్ వంశీ, అంబటి శ్రీను, నటి శ్రీరాప, జెమిని సురేష్, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలో డైలాగ్స్, కాన్సెప్ట్ గాని ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండియన్ స్టూడెంట్స్ పైన ట్రంప్ టార్గెట్?!, ఏం చేసారో తెలుసా?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌‌ను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంది.. చంద్రన్న

Sri Venkateswara University: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు యువతి రీల్స్ (video)

జూబ్లీహిల్స్ ఉప పోరు ఎపుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments