Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాతవాసి #KodakaaKoteswarRaoSong మీ కోసం.. (వీడియో)

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా "అజ్ఞాతవాసి"జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ పాడిన కొడకా కోటేశ్వర్రావు పాటను కొత్త సంవత్సరం కానుకగా సినీ యూనిట్ డిసెంబర్ 31న విడుదల చేసింది

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (18:18 IST)
పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా "అజ్ఞాతవాసి"జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పవన్ పాడిన కొడకా కోటేశ్వర్రావు పాటను కొత్త సంవత్సరం కానుకగా సినీ యూనిట్ డిసెంబర్ 31న విడుదల చేసింది. 
 
త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్- పవన్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి అజ్ఞాతవాసితో హిట్ కొట్టాలని సినీ యూనిట్ భావిస్తోంది. 
 
ఇప్పటికే పాటలు విడుదలయ్యాయి. ఈ పాటలకు మంచి స్పందన వస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవన్ పాడిన ''కొడకా కోటేశ్వరావు'' అనే పాటను డిసెంబర్ 31న ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్‌ పవన్‌కు జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, కుష్బూ, బొమన్‌ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. "కొడకా కోటేశ్వర్రావు" పూర్తి పాట వీడియో మీ కోసం... 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments