కొందరు కులం లోంచి పుడతారు.. కొందరు జనం లోంచి పుడతారు.. కానీ.. పుట్టుకతో మీసమున్న ఓ వీరుని కథ... కొబ్బరి మట్ట.. అని సంపూర్ణేష్ బాబు తాజా పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
హృదయం కాలేయం, ఈ రోజుల్లో ఫేమ్ సంపూర్ణేష్ బాబు తాజా కామెడీ మూవీ కొబ్బరి మట్ట పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొబ్బరి మట్ట పోస్టర్, టీజర్లో సంపూర్ణేష్ మీసమున్న బాహుబలిగా కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌కు నెటిజన్ల మధ్య మంచి రెస్పాన్స్ వస్తోంది.
తన యాక్టింగ్ కడుపుబ్బా నవ్వించే సింగం 123, హృదయం కాలేయం సినిమా ద్వారా మంచి హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. కామెడీని పండించే సంపూర్ణేష్ అంటేనే పడిచస్తున్న వారికి త్వరలోనే కొబ్బరి మట్ట సినిమా కూడా సూపర్ ట్రీట్ అంటూ సినీ పండితులు అంటున్నారు.