Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 భాషల్లో 55 దేశాల్లో రిలీజ్ కానున్న అడ్వెంచర్ మూవీ " విక్రాంత్ రోణ"

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:28 IST)
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన చిత్రం విక్రాంత్ రోణ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 19వ తేదీన రిలీజ్‌కానుంది. జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని అనుప్‌ భండారి దర్శకత్వం వహించారు. 
 
సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా సిల్వ‌ర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సుదీప్ న‌టిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా కిచ్చా సుదీప్ సినీ జ‌ర్నీకి సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ 'విక్రాంత్ రోణ' పద్నాలుగు భాషల్లో, 55 దేశాలలో విడుదల చేస్తుండటం విశేషం. 
 
ఈ సంద‌ర్భంగా దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ 'మా విక్రాంత్ రోణను ఆగ‌స్టు 19న విడుద‌ల చేస్తున్నామ‌ని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాం. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బెస్ట్ టెక్నీషియ‌న్స్‌తో విక్రాంత్ రోణ అనే స‌రికొత్త హీరోను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం' అని వెల్లడించారు. 
 
ఇక విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందుతోన్న 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని త్రీడీ టెక్నాల‌జీలో విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తారు. ఇక సుదీప్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. రాజమోళి తెరకెక్కించిన ఈగ సినిమాలో విలన్‌‌గా నటించి ఆకట్టుకున్నాడు. అలాగే సుదీప్ నటించిన పలు కన్నడ సినిమాలు ఇక్కడ కూడా డబ్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అత్యవసర పరిస్థితి ఉంటే జగన్ ఇలా తిరుగుతుంటాడా?... పైలట్ కన్నీళ్లు పెట్టుకున్నాడు?

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments