Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ సాంగ్ పోస్టర్

Webdunia
గురువారం, 4 మే 2023 (17:37 IST)
Khushi Song Poster
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సమంత కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఖుషీ. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ నెల 9న విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. విజయ్, సమంత మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలెట్ అనేలా ఆ ఇద్దరి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 
 
అలాగే ఇదో స్వచ్ఛమైన మనసుల కథ అని తెలిసేలా చుట్టూ తెల్లని మంచు కొండలు, తెల్లని పావురాల మధ్య మనసంతా స్వేచ్ఛా విహంగంలా మారింది అనేలా విజయ్ సోలో ఫోటో సైతం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ పోస్టర్ చూడగానే ఈ మూవీ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో అని అర్థం చేసుకోవచ్చు. 
 
హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ‘ నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాబోయే ఈ పాటతో మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా ఈ లిరికల్ సాంగ్ ఉంటుంది. 
 
ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

తర్వాతి కథనం
Show comments