Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ ఇండియా మూవీగా ఖుదీరామ్ బోస్ బయోపిక్

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (19:41 IST)
M Venkaiah Naidu is launching the title of Khudiram Bose biopic
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర‌ సమర యోధుడు బయోపిక్ చిత్రం "ఖుదీరామ్ బోస్". తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా  ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్ ను  భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేసారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..
 
Khudiram Bose biopic
భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్,తను 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు.ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం.చరిత్రను అనుసరించే  విద్యార్థులకు బాగా తెలుసు. ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరూ ఈ సినిమాకు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు  పూర్తి చేసుకున్న  ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు.
 
తారాగణం:
రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్: గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్
సినిమా పేరు: ఖుధీరం బోస్
నిర్మాత: విజయ్ జాగర్లమూడి
దర్శకుడు: విద్యా సాగర్ రాజు
DOP: రసూల్ ఎల్లోర్
ప్రొడక్షన్ డిజైనర్: పద్మ శ్రీ తోట తరణి
సంగీత దర్శకుడు: మణి శర్మ
స్టంట్ డైరెక్టర్: కనల్ కన్నన్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డైలాగ్స్: బాలాదిత్య
పి. ఆర్. ఓ : నాయుడు - ఫణి మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌కు దివ్వెల మాధురి వార్నింగ్.. డ్యాన్స్‌కు శ్రీనివాస్ ఫిదా (video)

బియ్యం గోడౌన్‌లో గంజాయి బ్యాగ్ పెట్టేందుకు ప్రయత్నించారు, పోలీసులపై పేర్ని నాని ఆరోపణ

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments