Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇట‌లీలో 'ఖిలాడి' ‌‌

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (17:24 IST)
Khiladi
'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఖిలాడి'‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌. డా. జ‌యంతీలాల్ గ‌డ  స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
 
హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్నఈ మూవీకి  'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. ఈ  సినిమా యాక్ష‌న్ ల‌వ‌ర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. మే 28న 'ఖిలాడి'ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
 
ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో జ‌రుగుతోంది. అక్క‌డ ర‌వితేజ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇంత‌కుముందు ర‌వితేజ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేసిన వీడియో గ్లిమ్స్‌కు, రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ర‌వితేజ లుక్ అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది.
 
ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ 'ఖిలాడి'ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చి దిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్న‌ది. సౌత్ ఇండ‌స్ట్రీలోని న‌లుగురు టాప్ ఫైట్ మాస్ట‌ర్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు మాస్ట‌ర్స్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. 'లూసిఫ‌ర్' ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
శ్రీ‌కాంత్ విస్సా, దేవిశ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్‌ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌మ‌ణి సాహిత్యం అందిస్తున్నారు. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.
 సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ‌
నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు
బ్యాన‌ర్లు: ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌
ప్రొడ‌క్ష‌న్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
స‌మ‌ర్ప‌ణ‌: డాక్ట‌ర్ జ‌యంతీలాల్ గ‌డ‌
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్‌
స్క్రిప్ట్ కో ఆర్డినేష‌న్‌: పా‌త్రికేయ‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు
డైలాగ్స్‌: శ్రీ‌కాంత్ విస్సా, సాగ‌ర్‌
ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
పాట‌లు: శ్రీ‌మ‌ణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments