Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

దేవీ
శనివారం, 24 మే 2025 (16:42 IST)
Mahesh Babu, Anushka Shetty
తెలుగు సినిమా ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా.  2010లో విడుదలైన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా మే 30 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు రంగం సిద్దం అయింది. ఈ మేరకు ఆన్ లైన్ లో విడుదల చేసిన టికెట్లు హాట్ కేకుల్లా బుకింగ్ అవుతుండడం విశేషం. 
 
ముఖ్యంగా మహేష్ బాబు అద్భుతమైన నటన, ఆ డిక్షన్, డైలాగ్ డెలివరీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ డైలాగ్స్ అలరిస్తాయి. మణిశర్మ అందించిన సాంగ్స్, బీజీఎంతో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. రీరిలీజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేకమైన రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఖలేజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 స్క్రీన్‌లలో రీ-రిలీజ్ అవుతుంది. రీ-రిలీజ్‌లలో చిత్రాలలో ఈ స్థాయిలో స్క్రీనింగ్ లలో విడుదల అవడంలో రికార్డు సృష్టించింది. 
 
అంతే కాదు అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు సృష్టిస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే 100 కే పైగా టికెట్లు బుక్ అయ్యాయి అంటేనే సినిమాకు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఖలేజా రీ-రిలీజ్ ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఒక పండగ లాంటిది. వెండితెరపై ఆయన్ను చూడాలి అనుకున్న అభిమానులకు ఇదో సువర్ణ అవకాశం కూడా. అందుకే ఖలేజా రీరిలీజ్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి అభిమానులు సిద్దం అయ్యారు. 
 
నటీనటులు: మహేష్ బాబు, అనుష్క శెట్టి,  ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు, షఫీ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments