Webdunia - Bharat's app for daily news and videos

Install App

​'హండ్రెడ్‌ డేస్‌ ఆడే సినిమా నీదే అన్నయ్య'... యూట్యూబ్‌లో 'ఖైదీ నంబర్.150' చిత్రం పాట రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం.150' చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే వారిని ఉత్సాహపరుస్తూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూనేవున్నారు. తాజాగా ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (20:08 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెం.150' చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే వారిని ఉత్సాహపరుస్తూ ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూనేవున్నారు. తాజాగా ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 
 
'జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా! సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. ఈ సీడ్‌ మూవీస్‌లో కూడా ఫుల్‌ బోర్డు పెట్టాలా. ఆర్టీసీ రోడ్డు, బెజవాడ సర్కిల్‌ వార్డు.. తెలంగాణ మొత్తం వేచి చూడాలా.. దాయిదామ స్టెప్పు వేసి ఎన్నాళ్లైందో? ఈల వేసి, గోల చేసి ఎన్నాళ్లైందో..' అంటూ సాగే పాటను చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా రూపొందించారు. 
 
చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు అంకితం చేస్తూ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్‌ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్‌ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్‌ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments