Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఖైదీ నెంబర్ 150'' సంక్రాంతికి రాలేదు.. ఆ పెద్ద పండగే అన్నయ్య వద్దకు వచ్చింది.. జబర్దస్త్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెంబర్ 150'' ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న రిలీజ్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన 'కత్తి' రిమేక్‌గా తెలుగులో 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కించారు. ఓవర్ సీస్‌‍

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (12:56 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెంబర్ 150'' ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న రిలీజ్ అయ్యింది. తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన 'కత్తి' రిమేక్‌గా తెలుగులో 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కించారు. ఓవర్ సీస్‌‍లో అయితే అప్పుడే చిరు మేనియాతో దద్దరిల్లిపోతోంది. ప్రీమియర్ షోలకు బీభత్సంగా కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. కేవలం ప్రీమియర్ షోలతోనే వన్ మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. 
 
ఇంకా పండగ మూడు రోజులు ఉండగానే వసూళ్లు ఈ రేంజ్‌లో ఉంటే వారం రోజుల తర్వాత లెక్కలు కడితే బాక్స్‌లు బద్ధలు కావలసిందే అన్న జోష్‌లో ఉన్నారు మెగా ఫ్యాన్స్. బాస్ సినిమా చాలాకాలం తర్వాత రిలీజ్ అవుతోంది అన్న ఉత్సాహంలో ఉన్నారు. మాస్, క్లాస్, కామెడీతో పాటు మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌తో చిరంజీవి రెండు పాత్రల్లో దుమ్మురేపారని అంటున్నారు.
 
బాస్ ఈజ్ బ్యాక్ అనే అరుపులూ, కేరింతలూ పదేళ్ళ తర్వాత అన్నయ్యని స్క్రీన్ మీద చూసుకున్న ఆనందం అంతా ఇంతా కాదని ఫ్యాన్స్ అంటారు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు చిరు సినిమా విడుదలైన ప్రతీ థియేటర్ వద్దా అభిమానుల సందడితో వాతావరణం ఉల్లాసంగా కేరింతలతో హోరెత్తిపోతోంది. 
 
పదేళ్ళ విరామం తర్వాత వచ్చినా తన స్టామినా ఏమిటో మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నాడు అన్నయ్య అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి అన్నయ్య 150వ సినిమా రాలేదని, 150వ సినిమా సందర్భంగానే సంక్రాంతి వచ్చిందని మెగా ఫ్యాన్స్.. జబర్దస్త్ టీమ్ వెల్లడించింది. ఇక సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఖైదీ సినిమాను చూసేందుకు థియేటర్ల చుట్టూ తిరుగుతున్నారు. సినిమాను ఫస్ట్ షో చూసేందుకు చాలామంది తారలు థియేటర్లకు చేరుకుంటున్నారు. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments