Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఖైదీ నెంబర్ 150'' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభం... మెగా ఫ్యాన్స్‌ పండగ.. నీరు నీరు పాట రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెంబర్ 150'' ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైంది. గుంటూరు సమీపంలోని చినకాకాని దగ్గరున్న 'హాయ్ ల్యాండ్'లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అభిమాన

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (18:18 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ''ఖైదీ నెంబర్ 150'' ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైంది. గుంటూరు సమీపంలోని చినకాకాని దగ్గరున్న 'హాయ్ ల్యాండ్'లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దాదాపు లక్షమంది మెగా ఫ్యాన్స్ ఈ వేడుకకు హాజరవుతారనుకుంటే.. అంచనాలకు మించిన ఫ్యాన్స్‌తో వేదిక నిండిపోయింది. 
 
ఈ నేపథ్యంలో వారిలో ఉత్సాహం తగ్గకుండా ఉండేందుకు నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో డాన్సర్లు చిరంజీవి హిట్ సాంగ్స్‌కు డాన్స్ వేస్తూ అభిమానులను అలరించారు. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్  చేస్తూ రికార్డులను బద్ధలు కొట్టిన తరుణంలో.. నీరు నీరు అంటూ సాగే పాటను.. అశ్వనీదత్ రిలీజ్ చేశారు. 
 
ఈ పాటకు సంగీతం సమకూర్చిన దేవీశ్రీ ప్రసాద్‌ను అశ్వనీదత్ కొనియాడారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి బంపర్ హిట్ సినిమాను చిరంజీవితో చేసిన తాను బాస్ ఎప్పుడు వస్తాడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని అశ్వనీదత్ నమ్మకం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments