Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఖైదీ నెం.150'' మైనస్ పాయింట్స్.. డాన్సులు చేయడంలో చిరంజీవి ఇబ్బందిపడ్డారా? సెంటిమెంట్ డౌన్?

ఖైదీలో ఉన్న మైనస్‌ల గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఖైదీ 150 సినిమాను వినాయక్ అద్భుతంగా తెరకెక్కంచినా.. తమిళ మాతృకతో పోలిస్తే రైతు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం తగ్గిందని సినీ పండితులు అంటున్

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (14:06 IST)
''ఖైదీ నెం.150'' సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఫ్యాన్స్ కేకలు, అరుపులతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తిపోతున్నాయి. ఇంత సందడి నెలకొన్న విశాఖ రామాటాకీస్ వద్ద ఓ యువకుడు హంగామా చేశాడు. మద్యం మత్తులో బ్లేడ్‌తో ఒంటిపై గాయపరచుకుని ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. చిరు సినిమా టిక్కెట్ కావాలంటూ నానా రచ్చ చేశాడు. 
 
దీంతో థియేటర్ యాజమాన్యంలో ఆందోళన నెలకొంది. వెంటనే అతడిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని చూశారు. కానీ అతడు మూర్ఖంగా వ్యవహరించాడు. సినిమా టికెట్ ఇవ్వకపోతే చచ్చిపోతానంటూ అందరినీ హడలెత్తించాడు. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.
 
ఇదిలా ఉంటే.. సినిమాలో పాజిటివ్ విషయాలు బోలెడున్నా మైనస్‌లు లేకపోలేదు. ఖైదీలో ఉన్న మైనస్‌ల గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఖైదీ 150 సినిమాను వినాయక్ అద్భుతంగా తెరకెక్కంచినా.. తమిళ మాతృకతో పోలిస్తే రైతు సెంటిమెంట్‌కు ప్రాధాన్యం తగ్గిందని సినీ పండితులు అంటున్నారు. డాన్సులు చేయడంలో చిరు ఇబ్బందిపడ్డట్లు స్పష్టమైన సంకేతాలున్నాయి. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేకుండాపోయింది. కాజోల్ పెర్ఫామెన్స్‌కు తావు లేకుండా పోయింది. కంటిన్యువేషన్‌కు సంబంధించి అరడజను దాకా బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి.  
 
* కామెడీ ట్రాక్ మోతాదు మించింది. 
* ఆర్టిస్టులు ఎక్కువ కావడంతో వారికి సరైన అకామడేషన్ లేకపోయింది. 
కానీ రత్నవేల్ కెమెరా పనితనం భేష్ అనిపించింది... చెర్రీ అప్పీరియన్స్ 20 సెకన్లే అయినప్పటికీ.. అదుర్స్ అనిపించింది. డీఎస్పీ మార్క్ బీట్స్, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసింది. నెగటివ్స్ చాలా తక్కువగా కనిపించినా.. పాజిటివ్ అంశాలు బోలెడుంటడంలో సినిమా బంపర్ హిట్‌కు చేరువలో ఉంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments