Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా అభిమానిగా మారిన చిరంజీవి తల్లి అంజనాదేవి... థియేటర్‌లో ఏం చేశారో తెలుసా?

మెగాస్టార్ తల్లి అంజనాదేవి ఓ అభిమానిగా మారిపోయారు. తన బిడ్డ చిరంజీవి ఆరు పదుల వయసులో, 9 సంవత్సరాల విరామం తర్వాత నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రాన్ని వీక్షించేందుకు స్వయంగా థియేటర్‌కు సగటు అభిమానిగా వచ్

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (12:47 IST)
మెగాస్టార్ తల్లి అంజనాదేవి ఓ అభిమానిగా మారిపోయారు. తన బిడ్డ చిరంజీవి ఆరు పదుల వయసులో, 9 సంవత్సరాల విరామం తర్వాత నటించిన "ఖైదీ నంబర్ 150" చిత్రాన్ని వీక్షించేందుకు స్వయంగా థియేటర్‌కు సగటు అభిమానిగా వచ్చారు. ఇతర ప్రేక్షకులతో కలిసి ఆమె తన బిడ్డ చిత్రాన్ని వీక్షించారు. 
 
చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. హైద్రాబాద్ నగరంలో కూడా అనేక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. 
 
నగరంలోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చారు. వీరిలో చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, హీరో అల్లు అర్జున్, భార్య స్నేహారెడ్డితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. 
 
అల్లు అర్జున్ రావడంతో థియేటర్ వద్ద కోలాహలం మరింత పెరిగింది. యువకులంతా అల్లు అర్జున్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంలో స్వల్ప తోపులాట జరిగింది. థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అల్లు అర్జున్ చెప్పాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments