Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ' కలెక్షన్లు చూసి బెంబేలెత్తిపోతున్న రాజమౌళి... కొత్త టార్గెట్స్‌ను అధిగమించేదెలా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్.150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ మొదటి రోజు కలక్షన్స్ స

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (10:11 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్.150". ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ మొదటి రోజు కలక్షన్స్ సునామీ ముగిసిన తర్వాత 12వ తేదీన విడుదలైన 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ జోరు తగ్గుతుందని అందరూ భావించారు. అయితే, 'శాతకర్ణి'తో పాటు 'శతమానం భవతి' విడుదల అయిన తర్వాత కూడా ఈ మూవీ కలెక్షన్స్ జోరు తగ్గక పోవడం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. మొదటివారం ముగిసే సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్లు వసూలు చేయగా, టాలీవుడ్‌లో రూ.100 కోట్లను క్రాస్‌ చేసిందని పేర్కొన్నారు.
 
అదేసమయంలో బుధవారంతో 'ఖైదీ నెంబర్.150' విడుదలై వారంరోజులు పూర్తయింది. నేటి నుంచి ఈ సినిమాకు రెండో వారం రన్ ప్రారంభమైంది. టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమాకు అసలు పరీక్ష ఈరోజు నుంచే మొదలవుతుంది. చిరంజీవి రీఎంట్రీ అదిరిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఈ చిత్రం కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేక పోయారు.
 
దీంతో దర్శకధీరుడు రాజమౌళికి భయం పట్టుకుంది. 'బాహుబలి' కలెక్షన్లను 'ఖైదీ' క్రాస్ చేసే అవకాశం లేనప్పటికీ కొన్ని ఏరియాలలో మాత్రం 'ఖైదీ' 'బాహుబలి'ని క్రాస్ చేయడం ఖాయం అని అంటున్నారు. దీంతో 'బాహుబలి-2'కు కొత్త టార్గెట్స్‌ను సృష్టించాల్సి ఉంటుంది. ఈ చిత్రం తన అకౌంట్ క్లోజ్ చేసే సమయానికి ఇంకా చాలా ఏరియాల్లో 'బాహుబలి' రికార్డులను క్రాస్ చేయడం ఖాయమన్నారు. దీంతో రాజమౌళి తన 'బాహుబలి 2'కు కొత్త టార్గెట్లు ఏర్పరుచుకోవలసిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 
 
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.76 కోట్లు, కర్ణాటకలో రూ.9 కోట్లు, నార్త్‌ ఇండియా రూ.1.3 కోట్లు, నార్త్‌ అమెరికా రూ.17 కోట్లు మిగిలిన ప్రాంతాల్లో రూ.3.99 కోట్లు, ఒరిస్సాలో రూ.40 లక్షలు, తమిళనాడులో రూ.60 లక్షలు చొప్పున మొత్తం మొత్తం 108.48 కోట్లు వసూలు చేసింది. ఇంకా భారీ వసూళ్ళను రాబట్టునుందనీ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎలక్ట్రానిక్ వార్ఫేర్‌ను మొహరించిన భారత్ : అష్టదిగ్బంధనం చేస్తోందంటూ పాక్ గగ్గోలు...

భారత్ అంటే అంత భయం అందుకే - పాక్ సైనికులే కాదు ఉగ్రవాదులు ఉ... పోసుకుంటున్నారు...

Cobra: బెంగళూరు-బాత్రూమ్‌లో ఆరడుగుల నాగుపాము.. ఎలా పట్టుకున్నారంటే? (video)

Mohan Babu: నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ- ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments