Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్‌ పవన్‌కి చెర్రీ ధన్యవాదాలు: ఎన్టీఆర్, మహేష్‌లకు చెర్రీ చాలా క్లోజ్.. అఖిల్ ఐతే?: చిరు

ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (14:23 IST)
ఖైదీ నెంబర్ 150 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈవెంట్‌కు మెగాహీరోలందరూ హాజరైయ్యారు. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం.. వేదికకు దూరంగా ఉండిపోయారు. కానీ వేడుకకు ముందు ట్విట్టర్‌ ద్వారా రామ్‌చరణ్‌కు, వదిన సురేఖకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 
 
పవన్‌ హాజరుకాకపోవడంపై మీడియా, అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ చిరంజీవి, రామ్‌చరణ్‌ మాత్రం పాజిటివ్‌ కామెంట్లే చేస్తున్నారు. కేవలం బిజీగా ఉండడం వల్లే పవన్‌ రాలేకపోయాడని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చెర్రీ కూడా బాబాయ్‌కి వత్తాసు పలికాడు. ఇందులో భాగంగా చెర్రీ సోషల్‌ మీడియా ద్వారా పవన్‌కు ధన్యవాదాలు తెలియజేశాడు. తమకు శుభాకాంక్షలు చెబుతూ పవన్‌ చేసిన ట్వీట్‌కు రామ్‌చరణ్‌ ధన్యవాదాలు తెలియజేశాడు.
 
ఇదిలా ఉంటే.. అభిమానులు, బయటివాళ్లు ఎలా అనుకుంటున్నా సినిమా వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తోటి హీరోలతో తనకు మంచి అనుబంధం ఉందని.. ఈ సంక్రాంతికే విడుదలవుతున్న 'గౌతమిపుత్రశాతకర్ణి' సినిమా ప్రారంభోత్సవానికి తాను వెళ్లానని గుర్తు చేశారు.
 
అలాగే నాగార్జున, వెంకటేష్‌లతోనూ తనకు మంచి అనుబంధముందని చిరంజీవి వెల్లడించారు. తనలాగానే రామ్‌చరణ్‌ కూడా తోటి కథానాయకులందరితోనూ స్నేహంగా ఉంటాడన్నారు. మహేష్‌ బాబుకి చెర్రీ చాలా క్లోజ్ అని, వారి ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ కూడా వెళ్లాడని చిరంజీవి అన్నారు. ఇక ఎన్టీఆర్‌కు కూడా చెర్రీ మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అఖిల్‌ అయితే చరణ్‌తో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు ఇంటికి వస్తుంటాడని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

నేను ఉదయం ఉండను.. నా వస్తువులే ఉంటాయి.. మహిళ ఆత్మహత్య

మస్తాన్ సాయి వద్ద లావణ్య న్యూడ్ వీడియోలు.. డిలీట్ చేయించిన రాజ్ తరుణ్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments