కేజీఎఫ్ డైరక్టర్‌తో మహేష్ బాబు.. ఇక ఫ్యాన్సుకు పండగే (video)

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (15:50 IST)
దేశ వ్యాప్తంగా ''కేజీఎఫ్'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాష్ నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ రానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేజీఎఫ్ డైరక్టర్‌తో సినిమా చేయబోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు మీకెవ్వరు మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ తరువాత నెక్స్ట్ ఏంటి అన్న ఆసక్తి ఇటు ఫ్యాన్స్‌లోనూ, అటు ఇండస్ట్రీలోనూ కూడా ఉంది. మహేష్ దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబో ఓ వైపు ఉంది. అయితే మహేష్ బాబు మాత్రం వంశీ పైడిపల్లి కంటే ముందే మరో మూవీకి కమిట్ అయ్యాడని అంటున్నారు.
 
ఈ సినిమా పూర్తికావడానికి మరో నాలుగు నెలల పాటు సమయం పట్టేలా వుండటంతో ప్రిన్స్.. కేజీఎఫ్ డైరక్టర్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు కేజీఎఫ్ డైరక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నాలుగైదు నెలల్లో మూవీని చేసి సమ్మర్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మహేష్ అనుకుంటున్నారని టాక్. కేజీఎఫ్ డైరక్టర్‌కి తర్వాత వంశీతో మహేష్ బాబు సినిమా వుంటుందని సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments