Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KGFChapter2Teaser సరికొత్త రికార్డులు.. విడుదలైన 16 గంటల్లోనే..? (video)

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:58 IST)
KGFChapter2Teaser
యాష్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే. అన్ని ఇండస్ట్రీలలో అదిరిపోయే బిజినెస్ చేస్తుంది కేజిఎఫ్ 2. 
 
తాజాగా యాష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన కేజిఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ ట్రైలర్ చరిత్ర సృష్టిస్తుంది.
 
2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ చూస్తుంటే చాప్టర్-2 ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. తొలి భాగానికి 10 రెట్లు అదిరిపోయేలా చాప్టర్ 2 తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక విడుదలైన క్షణం నుంచి ఈ ట్రైలర్ చరిత్ర సృష్టిస్తోంది.
 
నిజానికి జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. దాంతో జనవరి 7 రాత్రి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైన 16 గంటల్లోనే దాదాపు 23 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది కేజిఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్.
 
ఇక 2.8 మిలియన్ లైక్ లతో ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ ట్రైలర్ దూకుడు ఆగడం లేదు. జోరు చూస్తుంటే కచ్చితంగా 50 మిలియన్ క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది.
 
కొన్ని ప్యాచ్ వర్క్ మినహా సినిమా అంతా అయిపోవడంతో విడుదల తేదీ ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. అన్ని కుదిరితే మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కేజిఎఫ్-2 ఒకేరోజు విడుదల కానుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments