Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వార్తల్లో నిజం లేదు.. కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్‌లో నో ఛేంజ్

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (18:09 IST)
Yash
కన్నడలో రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా వచ్చిన ఈ చిత్రం కేవలం కన్నడంలో మాత్రమే కాకుండా, విడుదల అయిన అన్ని ప్రాంతాల్లో తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది.
 
కేజీఎఫ్ 2 చిత్రాన్ని ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా అనే పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ పోస్టర్ విడుదల చేసి ఏప్రిల్ 14, 2022 న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. 
 
అయితే వచ్చే ఏడాది వరుస సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల తేదీ మారనుందంటూ పలు వార్తలు వచ్చాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెప్పిన తేదీకే మూవీ విడుదల కానుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments