Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుక్షేత్రం చిత్రంలో చాలా రొమాంటిక్‌ సన్నివేశాలు ఉన్నాయి-అర్జున్

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (17:29 IST)
మీ టూలో భాగంగా.. యాక్షన్ కింగ్ అర్జున్‌ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరణ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై అర్జున్ స్పందించారు. శ్రుతి ఆరోపణలు విని షాక్ తిన్నానని చెప్పింది. ఈ ఆరోపణలను జీర్ణించుకోలేకపోయానని, ఆమె చేసిన వ్యాఖ్యలతో తాను నిజంగానే తప్పు చేశానని అనుకుంటారు.


అందుకే మాట్లాడుతున్నా. అందుకే క్లారిటీ ఇస్తున్నా. తాను ఇప్పటి వరకు 60మంది అగ్ర హీరోయిన్లతో పనిచేశాను. ఎవరూ అభ్యంతరకరమైన ఆరోపణలు చేయలేదు. దీన్ని బట్టి తానేంటో అర్థం చేసుకోవచ్చునని.. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకులు సన్నివేశాన్ని ఇంకా బాగా తెరకెక్కించేందుకు సలహాలు అడుగుతుంటారు. 
 
తాను కూడా మంచి సలహాలు ఇస్తే పాటిస్తారు. కురుక్షేత్రం చిత్రంలో రొమాంటిక్‌ సన్నివేశాలు చాలా ఉన్నాయి. అవి సౌకర్యంగా లేవని తాను ఒప్పుకోలేదు. అలాంటి సన్నివేశాలు కచ్చితంగా ఉండాలంటే ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటానని ముందే చెప్పా. నిజంగానే తనపై శ్రుతికి కోపం ఉంటే ప్రమోషన్‌లో తనను ఎందుకు ప్రశంసించారు?, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణల వెనుక ఎవరైనా ఉన్నారా? అని అర్జున్‌ ప్రశ్నించారు.
 
ఇకపోతే.. అర్జున్‌పై వస్తోన్న ఆరోపణలపై ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా నోరు విప్పారు. ఇన్నేళ్ల జీవితంలో మా నాన్న పబ్‌కి వెళ్లడం తానెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్‌కు ఎలా రమ్మంటారు? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా వారి పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని 'మీ టూ' అంటారు. కానీ శ్రుతి చేస్తున్న ఆరోపణల్లో నాకు ఆ విషయం ఎక్కడా కనిపించడం లేదు' అని ఐశ్వర్య మండిపడ్డారు. 
 
ఇప్పుడీ వివాదం కన్నడ చిత్ర పరిశ్రమలలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. శ్రుతి హరిహరణ్‌పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె క్షమాపణలు తెలపాలని అర్జున్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆమెకు అర్జున్‌ క్షమాపణలు చెప్పాలని ప్రకాష్‌ రాజ్‌ కోరారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments