Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేతికా శ‌ర్మ ల‌వ్ లీ గాళ్ - వైష్ణ‌వ్ తేజ్- న‌న్ను ఆట‌ప‌ట్టించాడు- కేతిక శ‌ర్మ‌

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (10:01 IST)
Ketika Sharma, Vaishnav Tej
‘ఉప్పెన’  హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు.
 
నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ పెయిర్ చక్కగా ఉంది. వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో చాలా హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నాడు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.
 
వైష్ణ‌వ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ట్రైల‌ర్‌ను చూస్తున్న‌పుడు ఎంత ‘రంగ రంగ వైభవంగా’ ఉండిందో రేపు సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లో చూస్తున్న‌ప్పుడు కూడా అంతే రంగ రంగ వైభ‌వంగా ఉంటుంది. శ్యామ్ ద‌త్‌గారు సినిమాకు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారి వ‌ల్లే ఓ మంచి టీమ్ క‌లిసి మంచి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. కేతికా శ‌ర్మ మంచి కోస్టోర్. త‌న‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ల‌వ్ లీ ఎక్స్‌పీరియెన్స్‌. సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌కు వ‌చ్చి మా ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను ఎంజాయ్ చేసి స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ చూస్తున్న వారిలో ఓ ఎన‌ర్జీని నేను గ‌మ‌నించాను. రేపు సినిమా చూస్తున్న‌ప్పుడు కూడా అదే ఎన‌ర్జీ ఉంటుంది. చాలా మంది ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టార‌ని అడిగారు. ఇగోస్ లేని ఏ రిలేషన్‌షిప్ అయినా ‘రంగ రంగ వైభవంగా’గా ఉంటుంద‌నే చెప్ప‌ట‌మే మా సినిమా కాన్సెప్ట్‌. కాబ‌ట్టే ఆ టైటిల్‌ను పెట్టాం. అమ్మాయి- అబ్బాయి, ఇద్ద‌రు స్నేహితులు, రెండు కుటుంబాల మ‌ధ్యన ఆ రిలేష‌న్‌షిప్ ఉండొచ్చు. సెప్టెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం. టైటిల్‌కు త‌గ్గ స‌క్సెస్‌ను ప్రేక్ష‌కులు అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
 
హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ ట్రైలర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీని చేశాం. ఈ సినిమాలో నాకు రాధ అనే పాత్ర‌ను ఇచ్చిన డైరెక్ట‌ర్ గిరీశాయ‌గారికి థాంక్స్‌. హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా కుదిరింది. వైష్ణ‌వ్ తేజ్ డైన‌మిక్ హీరో. చాలా మంచి స్నేహితుడిలా సెట్స్‌లో ఉంటూ న‌న్ను ఆట‌ప‌ట్టించాడు..అలాగే స‌పోర్ట్ చేశాడు.  సెప్టెంబ‌ర్ 2న ‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments