Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్ బాల భాస్కర్ ఇకలేరు.. శోక‌సంద్రంలో కుటుంబం

ప్రముఖ సింగర్ బాలభాస్కర్ ఇకలేరు. గత నెల 25వ తేదీన కుటుంబంతో దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగొస్తున్న ఆయ‌న కారు చెట్టుని ఢీకొట్టింది. తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు

Webdunia
మంగళవారం, 2 అక్టోబరు 2018 (12:27 IST)
ప్రముఖ సింగర్ బాలభాస్కర్ ఇకలేరు. గత నెల 25వ తేదీన కుటుంబంతో దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగొస్తున్న ఆయ‌న కారు చెట్టుని ఢీకొట్టింది. తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న వెన్న‌ముక దిబ్బ‌తింది.
 
మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్టింది. ప్ర‌మాదం జ‌రిగిన రోజు నుంచి మంగళవారం వరకు ఆయన మృత్యువుతో పోరాడుతూ మంగళవారం ఉదయం క‌న్నుమూశారు. ఆయ‌న భార్య ల‌క్ష్మీ, డ్రైవ‌ర్ అర్జున్‌లు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, కూతురు తేజ‌స్వీ స్పాట్‌లోనే మ‌ర‌ణించిన విషయం తెల్సిందే. 
 
కాగా, ప‌న్నేండేళ్ళ వ‌య‌స్సులో సంగీత విద్వాంసుడిగా మారి భాస్క‌ర్‌, ఏసుదాసు, చిత్ర, సుజాత, కార్తీక్, వయోలినిస్ట్‌గా పండిట్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, శివమణి, హరిహరన్, ఫాజల్ ఖురేషి ప్రముఖులతోనూ పనిచేసి, ప్రశంసలు అందుకున్నారు. అలాంటి బాల భాస్క‌ర్ ఇక లేర‌నే వార్త ఆయ‌న అభిమానుల‌ని క‌ల‌చి వేస్తుంది. 
 
ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఎంద‌రో అభిమానాన్ని చూర‌గొన్నారు. ఆయ‌న మృతిపై మాలీవుడ్ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. అభిమానుల సందర్శనార్ధం బాలభాస్కర్ భౌతికకాయాన్ని ఆయన విద్యాభ్యాసం చేసిన తిరువనంతపురం కాలేజీకి తరలిస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments