Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి భావన కేసులో కొత్తకోణం.. నటి కావ్యా మాధవన్ ఆఫీసులో సోదాలు

కేరళ చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటి భావనపై జరిగిన లైంగికవేధింపుల కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మరో నటి కావ్యా మాధవన్ వ్యాపార, బ్యాంకు ఖాతాలపై ఆ రాష్ట్ర పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులోని ప్రధ

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (07:04 IST)
కేరళ చిత్రపరిశ్రమకు చెందిన సినీ నటి భావనపై జరిగిన లైంగికవేధింపుల కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో మరో నటి కావ్యా మాధవన్ వ్యాపార, బ్యాంకు ఖాతాలపై ఆ రాష్ట్ర పోలీసులు ఆరా తీశారు. ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆమె వ్యాపార కార్యాలయాల్లో సోదాలు చేశారు. 
 
గతంలో నటి భావనను కిడ్నాప్ చేసిన కొందరు లైంగికంగా వేధించిన విషయంతెల్సిందే. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే, పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడైన పల్సర్‌ సునీ రెండుసార్లు మలయాళ స్టార్ దిలీప్ భార్య కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు విచారణలో వెల్లడించాడు. 
 
దీంతో ఈ కేసులో నటి కావ్య ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్‌ గురించి పోలీసులు ఆరా తీశారు. నటి భావనపై వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్‌లో దాచి పెట్టిఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాగా, 2016లో దిలీప్‌‌ను కావ్య వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అలాగే, ఈ కేసులో కావ్యా తల్లిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: జీవితంలో తొలిసారి అమెరికాకు కేసీఆర్.. ఎందుకో తెలుసా?

Kabaddi : కబడ్డీ ఆడుతూ... 26 ఏళ్ల వ్యక్తి ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు.. చివరికి?

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం