Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ పాడిన ఫ‌స్ట్ సాంగ్ అదిరింది

నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై... నేను లోక‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని..మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ఈ మల‌యాళ ముద్దుగుమ్మ త‌మిళ స్ట

Webdunia
బుధవారం, 25 జులై 2018 (21:04 IST)
నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై... నేను లోక‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుని..మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్‌. ప్ర‌స్తుతం ఈ మల‌యాళ ముద్దుగుమ్మ త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ చిత్రం పేరు సామి స్క్వేర్. సామి చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తోంది. హ‌రి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 
 
ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం విక్రమ్‌, కీర్తి గొంతు సవరించి, పాట పాడారు. విక్రమ్‌ ఇది వరకే పలు పాటలు పాడి, ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ కీర్తి సురేష్ ఆలపించిన తొలి పాట ఇది కావడం విశేషం. ఈ పాటతో ఆమె తనలో మంచి నటే కాదు, గాయని కూడా ఉందని నిరూపించారు. ఈ సంద‌ర్భంగా కీర్తి సురేష్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... సింగ‌ర్‌గా నా తొలి పాటను మీతో షేర్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ స్పందన కోసం ఎదురుచూస్తున్నా అంటూ పాట లింక్‌ను షేర్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments