కమిటయ్యే వ్యక్తిని కాదు.. అవసరమైతే జాబ్ చేసుకుంటా.. కీర్తి సురేష్

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:06 IST)
సినిమా అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదని, అవసరమైతే ఉద్యోగం చేసుకుంటానని హీరోయిన్ కీర్తి సురేష్ అన్నారు. పైగా, చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఉన్న మాట నిజమేనని ఆమె చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె తాజాగా స్పందిస్తూ, చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం చూసే మహిళలకు వేధింపులు నిజమేనని చెప్పారు. అయితే తన వరకు ఇంతవరకూ అలాంటి అనుభవం ఎదురుకాలేదన్నారు. 
 
ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం సినిమాలు మానేసి ఉద్యోగం చేసుకుంటానని చెప్పారు. అంతేకానీ, అవకాశాల కోసం తాను కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదని స్పష్టం చేశారు. మీ టూ ఉద్యమం వచ్చాకే సినిమా రంగంలోని క్యాస్టింగ్ కౌచ్ విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటీనటులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిర్గతం చేశారన్నారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ఈ విషయంలో ముఖ్యమన్నారు. మనం ఎలా ఉంటున్నాం.. ఏం చేస్తున్నామనేదాన్ని బట్టి కమిట్మెంట్ అడుగుతారేమోనని కీర్తి సురేష్ అభిప్రాయపడ్డారు. అందుకే తనకు ఇంతవరకు అలాంటి సందర్భం ఎదురుకాలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ నియామక పత్రం అందుకున్న శిరీష మాటలకు డిప్యూటీ సీఎం పవన్ భావోద్వేగం (video)

రూ.20లక్షలు, కారు కావాలన్నాడు.. చివరి నిమిషంలో పెళ్లి వద్దునుకున్న వధువు

పరకామణి లెక్కింపులో ఏఐని ఉపయోగించండి.. వాలంటీర్ల బట్టలు విప్పించడం...?: హైకోర్టు

లియోనెల్ మెస్సీ వంతార ప్రత్యేక పర్యటన, వన్యప్రాణులతో మరపురాని అనుభవాలు

Nara Lokesh: 99 పైసలకే భూమిని ఇచ్చినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం