Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు: కీర్తి ఆనందం

చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే ఒక్కో చిత్రానికి 3 కోట్లు డిమాండ్ చేస్తోందంటేనే కీర్తి సురేష్ ఏ రేంజ్‌లో ఎదిగిపోయిందో చెప్పవచ్చు. మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి దూసుకొచ్చిన కీర్తిసురేష్ అటు తమిళ హీరోలతో, ఇటు తెలుగు హీరోలతోనూ జత కట్టేసి ఎవరూ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (03:52 IST)
చిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే ఒక్కో చిత్రానికి 3 కోట్లు డిమాండ్ చేస్తోందంటేనే కీర్తి సురేష్ ఏ రేంజ్‌లో ఎదిగిపోయిందో చెప్పవచ్చు. మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి దూసుకొచ్చిన కీర్తిసురేష్ అటు తమిళ హీరోలతో, ఇటు తెలుగు హీరోలతోనూ జత కట్టేసి ఎవరూ ఊహించని పాపులారిటీ సంపాదించుకుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇళయదళపతి విజయ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకుంది. అంతేకాదు టాలీవుడ్‌లోనూ నటించిన రెండు చిత్రాలు విజయాన్ని చవిచూడడంతో అక్కడ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. ఇలా వరుస విజయాలతో ఆమె ఏకంగా 3 కోట్ల రూపాయలు తీసుకునే హీరోయిన్‌గా తారాపథంలోకి వెళ్లిపోయింది.
 
తాజాగా సూర్యతో తానాసేర్న్‌దకూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నడిగై తిలగైయార్‌(తెలుగులో మహానది)లో సావిత్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది. ఇందులో మరో క్రేజీ నటి సమంత కూడా నటించనున్నారు. ఈమె పాత్రికేయురాలిగా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తీసురేశ్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీర్తీ నటిగా ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని పేర్కొంది.
 
బైరవా చిత్రంలో విజయ్‌తో నటించిన అనుభవం అద్బుతం అంటున్న కీర్తి తాజాగా తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి నటిస్తోంది. మరో తమిళ స్టార్ నటుడు అజిత్‌తో రొమాన్స్ చేసే ఆవకాశం త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విశాల్‌తో కూడా సండైకోళి 2లో నటిస్తున్న కీర్తి కొలీవుడ్, టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన అవకాశాలు పొందడంలో ఎవరికీ ఆందనంత స్థాయిలో దూసుకుపోవడం విశేషం.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments