Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ హీరోయిన్ ఫిక్స్, ఇంతకీ ఎవరు..?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:34 IST)
సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించిన మహేష్‌ బాబు ఆతర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారడం.. ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా ఎనౌన్స్ చేయడం తెలిసిందే. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
 
షూటింగ్‌లు స్టార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వడంతో ఇక షూటింగ్‌లు స్టార్ట్ అవుతాయి అనుకున్నారు కానీ.. స్టార్ హీరోలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్టు చాన్నాళ్లు ప్రచారం జరిగింది.
 
గతంలో మహేష్ సరసన నటించిన కైరా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. దాదాపుగా ఈమె పేరు కన్ఫర్మ్ అనుకున్నారు కానీ... ఆ తర్వాత కైరా అద్వానీ కాదు అని తెలిసింది. తాజా వార్త ఏంటంటే... మహానటి సినిమాతో జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌ మహేష్‌ సరసన నటించనున్నది. ఈమె పేరు కూడా బాగా వినిపించింది.
 
అయితే... సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చాట్ చేసిన కీర్తి సురేష్‌ .. మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో నటించనున్నట్టు కన్ఫర్మ్ చేసింది. మహేష్‌ - కీర్తి సురేష్‌ జంట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments