Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్ . రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

డీవీ
సోమవారం, 27 మే 2024 (17:21 IST)
KVN Productions team
ప్రిన్స్ ధృవ స‌ర్జా హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. 1970లో బెంగుళూరులో జ‌రిఇన నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ ఆడియో రైట్స్ రూ.17.70 కోట్ల ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కు అమ్ముడ‌య్యాయి.
 
అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’చిత్రంపై మంచి అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఆగ‌స్ట్‌లో ఈ మూవీ నుంచి తొలి సాంగ్‌ను రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించటంతో ఇవి నెక్ట్స్ లెవ‌ల్‌కు రీచ్ అయ్యాయి. శిల్పా శెట్టి కుంద్రా, రమేష్ అరవింద్, సంజయ్ దత్, నోరా ఫతేహి, వి రవిచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది.
 
‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ సినిమా ప్రేక్ష‌కుల‌ను 1970లోని బెంగుళూరు నాటి ప‌రిస్థితుల‌కు తీసుకెళ‌తాయి. అప్పుడు జ‌రిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ  యాక్ష‌న్‌, పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి.
 
కె.వి.ఎన్‌.ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రేమ్ ద‌ర్శ‌కుడిగా ‘కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్’ తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని క‌న్న‌డ‌, త‌మిళ‌, తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments