లాక్‌డౌన్ వల్ల సినిమా హాళ్ళ యాజమాన్యం చాలా నష్టపోయింది. సినిమా రంగం అతలాకుతలమైంది. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. కొన్ని వరాలు ప్రకటించారు. అవి అమలు చేయాలని తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముక్తకంఠంతో వేడుకొంటోంది. బుధవారంనాడు తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. జిల్లాల నుంచి హాజరైన ఎగ్జిబి టర్స్ ఏకగ్రీవంగా ఒకే మాటపై వున్నారు. ముఖ్యంగా ఇటీవల చిరంజీవి నాగార్జున గారు సిఎం గారిని కలసినప్పుడు అనేక వరాలను ఎనౌన్స్ చేసారు అవి వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో ముఖ్యమైన అంశాలు ఈ విధంగా వున్నాయి.
- పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా థియేటర్స్ యాజమాన్యానికి పూర్తి హక్కులు ఇవ్వాలి
- కోవిడ్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్స్ కరెంట్ చార్జీలు మాఫీ చేయాలి
- టిక్కెట్ రెట్లు పెంచుకునేలా, మరియు అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్ లో ఇచ్చిన జీవో ను వెంటనే అమలు పరచాలి.
సుదర్శన్, దేవి థియేటర్స్ ఓనర్ గోవింద్ రాజ్ మాట్లాడుతూ,