Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెట్టే వాడికి... భయపడే వాడికి మధ్య "కవచం"లా ఒక్కడుంటాడురా..(Teaser)

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (11:08 IST)
టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "కవచం". శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించాడు. వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ చిత్రం టీజర్‌ సోమవారం రిలీజ్ అయింది. ఇందులో హీరో సాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. 
 
టీజ‌ర్‌లో ఎక్కువ భాగం యాక్ష‌న్ సీన్స్ ఉండ‌గా, డైలాగులు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. 'భయపెట్టే వాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒక్కడుంటాడురా. వాడే పోలీస్' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
చిత్రంలో హ‌ర్షవ‌ర్ధన్ రాణే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ కీల‌క‌పాత్రల్లో న‌టించారు. పోసాని కృష్ణముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే 'క‌వ‌చం' షూటింగ్ పూర్తి కాగా, పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రమే మిగిలి ఉంది. ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కే.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments