Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తిలాంటి షాట్లు కొట్టిన కత్రినా.. వరల్డ్ కప్‌కు ఎంపిక చేయాలంటూ విన్నపం...

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (13:55 IST)
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్. వెండితెరపై నటనతో అదరగొట్టేస్తుంది. తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మంత్రమగ్ధులను చేస్తుంది. అలాంటి కత్రినా కైఫ్.. క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించింది. దీంతో ఆమెను ప్రపంచ క్రికెట్ కప్‌కు ఎంపిక చేయాలంటూ ఆమె కోరుతోంది. కత్రినా ఏంటి బ్యాట్ పట్టడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి... 
 
ప్రస్తుతం కత్రినా కైఫ్ 'భారత్' అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇటీవలే "జీరో" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కత్రినా చేసిన ఐటమ్ సాంగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ చిత్రంలో అనుష్క శ‌ర్మ కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఇదిలావుంటే, కత్రినా నటిస్తున్న తాజా చిత్రం 'భారత్‌'కు ప్యాక‌ప్ చెప్ప‌గానే సహచర నటీనటులతో కలిసి క్రికెట్ ఆడింది. 
 
అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ జీరో కోస్టార్ అనుష్క శ‌ర్మ‌కి మెసేజ్ ఇచ్చింది. "నా బ్యాటింగ్ తీరు చూసి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడే అవ‌కాశం ఇవ్వ‌మని మీ భ‌ర్త (విరాట్ కోహ్లీ)కి సూచ‌న చేయ‌వు. నేను ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మై ఉన్నాను. మంచి ఆల్ రౌండ‌ర్‌గా జ‌ట్టుకి సేవ‌లందిస్తానంటూ" ఫ‌న్నీ కామెంట్ పెట్టింది కత్రినా. ప్ర‌స్తుతం క‌త్రినా క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 
 
సాధారణంగా మేక‌ప్‌లు వేసుకొని సినిమాల‌తో బిజీగా ఉండే కత్రినాలో ఇంత టాలెంట్ ఉందా ఉంటా ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మైదానంలో ఉన్నవారందరూ క‌త్రినా బ్యాటింగ్ తీరు చూసి మురిసిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments