Webdunia - Bharat's app for daily news and videos

Install App

''కాటమరాయుడు'' ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూడండి.. భారీ మొత్తానికి బిజినెస్?

పవన్‌కల్యాణ్ - శృతిహాసన్ జంటగా నటించిన ''కాటమరాయుడు'' ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ అమ్మవారి గుడిలో పవన్- శృతిహాసన్‌ల మధ్య కీలక సన్నివేశాల్ని షూట్ చేసుకుంద

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (17:19 IST)
పవన్‌కల్యాణ్ - శృతిహాసన్ జంటగా నటించిన ''కాటమరాయుడు'' ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. తాజాగా ఈ సినిమా హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ అమ్మవారి గుడిలో పవన్- శృతిహాసన్‌ల మధ్య కీలక సన్నివేశాల్ని షూట్ చేసుకుంది. ప్రస్తుతం కాటమరాయుడు, ఆయన బ్రదర్స్‌పై కొన్ని సీన్స్‌ని డైరెక్టర్ తెరకెక్కించాడు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈ ఫోటోల్లో కాటమరాయుడితో పాటు ఆయన సోదరులు కనిపిస్తారు. ఈ ఫోటోల్లో పవన్ చూసినవాళ్లు, ఎంత సింపుల్‌గా వున్నాడని అనుకుంటున్నారు. బయటకేకాదు, సెట్స్‌లోనూ అలాగే వుంటాడన్నది యూనిట్ సభ్యులమాట. అన్నట్లు.. ఆ మధ్య కాటమరాయుడి టీజర్‌ని జనవరి 26న రిలీజ్ చేస్తారని వార్తలొచ్చినప్పటికీ, అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త డేట్‌ని ప్రకటించేందుకు సర్వం సిద్ధమవుతోంది. 
 
ఇదిలా ఉంటే.. కాటమరాయుడు సినిమాను ‘గోపాల గోపాల’ ఫేం డాలీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్నయ్య పాత్రలో కనిపించనున్నారు. అజిత్ నటించిన తమిళ సినిమా ‘వీరం’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
''కాటమరాయుడు'' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ బిజినెస్ మొదలు పెట్టేశారన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. అంతేకాక ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments