Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనూ లైంగిక వేధింపుల బాధితురాలినే... నటి కస్తూరి (Video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:39 IST)
భారతీయ చిత్ర పరిశ్రమను లైంగిక వేధింపులు అంశం ఇపుడు కుదిపేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇందులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణల దెబ్బకు బాలీవుడ్ ప్రముఖులు నోరెళ్లబెట్టారు. ఈ క్రమంలో కోలీవుడ్‌కు చెందిన నటి కస్తూరి కూడా ఈ తరహా ఆరోపణలు చేశారు. తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆమెను ఎవరు వేధించారన్న సంగతిని మాత్రం బహిర్గతం చేయలేదు. 
 
సినీ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు తాము లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆయనపై ముంబైలో పోలీసు కేసు నమోదైంది. 
 
ఇదిలావుంటే దక్షిణాది సీనియర్ నటి కస్తూరి స్పందించారు. అనురాగ్ కశ్యప్‌పై పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆ ఆరోపణలకు ఆధారాలు ఉండవని... కోర్టుల్లో ఇవి నిలబడవన్నారు. 
 
ఈ మేరకు ఆమె చేసిన ఓ ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ... పాయల్ పరిస్థితి మీ కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. దీనిపై కస్తూరి స్పందిస్తూ తన కుటుంబం వరకు ఎందుకు? తానే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పారు. 
 
సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనకు వేధింపులు ఎదురయ్యాయని తెలిపారు. కస్తూరి చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. ఆమెను వేధించింది ఎవరై వుంటారన్న సందేహం ఇపుడు ఉత్పన్నమవుతోంది.  
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం