Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తిని రేకెత్తిస్తున్న "కార్తికేయ-2" పోస్టర్

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (12:20 IST)
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రం కార్తికేయ. మంచి హిట్ సాధించింది. ఈ సినిమా స్టోరీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందించారు. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 
 
ఈ కథ ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుందని ముందుగానే చెప్పారు. తాజాగా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మోషన్ పోస్టర్‌ను వదిలారు. "సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ద్వారకా నగరం" అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్‌తో ఈ మోషన్ పోస్టరును తాజాగా రిలీజ్ చేశారు. 
 
సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకలో దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి అనుపమతో కలిసి నిఖిల్ బయల్దేరినట్టుగా ఈ పోస్టర్‌ను చూస్తే ఇట్టే తెలుసుకోవచ్చు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో  జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరిపంట వేస్తే ఉరితో సమానమంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు : మంత్రి సీతక్క

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం : ఆంధ్రా - ఒరిస్సాలకు వర్ష హెచ్చరిక

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments