Webdunia - Bharat's app for daily news and videos

Install App

యు.ఎస్‌.ఎ.లో కార్తికేయ-2 యాభైరోజుల వేడుకలు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:02 IST)
TG Vishwa Prasad with usa team
నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2’ USAలో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
 
TG Vishwa Prasad with usa team
ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది.  ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీస్ కార్తికేయ-2 చిత్రాన్ని రిలీజ్ చేసారు. మునెపెన్నడూ లేని విధంగా మొదటిసారి యునైటెడ్ స్టేట్స్‌లో 50 రోజుల వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హాజరై సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
 
కార్తికేయ 2' చిత్రం అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించింది.  ఈ చిత్రాన్ని తెరకెక్కించిన మూవీ టీంకి ఇప్పటికి ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.  2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని TG విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. కార్తికేయ 2 లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది.
 
ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అద్భుతమైన విజయం సాధించి ఇప్పటికి కొనసాగుతుంది.అనుపమ్ ఖేర్ కృష్ణతత్వాన్ని చెప్పే సీన్ ఈ సినిమాకి మేజర్ హైలెట్. ఈ చిత్రానికి కాల భైరవ సంగీత దర్శకుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హెచ్ఐవీ బాధిత బాలికను సైతం వదిలిపెట్టని కామాంధుడు!

అనకనంద ఆస్పత్రిలో అనధికారికంగా కిడ్నీ మార్పిడి!!

సీఎం స్టాలిన్ హయాంలో అత్యాచారాలు పెరిగిపోయాయి : నటి గౌతమి

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments