Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్, శింబు నా వద్ద దురుసుగా ప్రవర్తించారు.. సుచిత్ర ఆరోపణలు నిజమేనా?

కోలీవుడ్ హీరోలు ధనుష్, శింబులపై తమిళ గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తెలుగులో సారొచ్చారు.. డోలె డోలె వంటి పాటలు పాడిన ఈమె.. నటి భావన లైంగిక దాడి ఘటనతో షాకైన వారందరికీ.. మరో షాకిచ్చింది. ధనుష్, శి

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:41 IST)
కోలీవుడ్ హీరోలు ధనుష్, శింబులపై తమిళ గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తెలుగులో సారొచ్చారు.. డోలె డోలె వంటి పాటలు పాడిన ఈమె.. నటి భావన లైంగిక దాడి ఘటనతో షాకైన వారందరికీ.. మరో షాకిచ్చింది. ధనుష్, శింబులు తన వద్ద దురుసుగా ప్రవర్తించడం ద్వారా తాను గాయాల పాలైనట్లు సుచిత్ర ట్విట్టర్ ద్వారా ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఇంకా ధనుష్, శింబు తనతో దురుసుగా ప్రవర్తించారనేందుకు ఆధారాలను కూడా ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తన చేతిపై చేసిన గాయాల ఫోటోలను కూడా ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పొందుపరించింది. 
 
అయితే సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిందని, ధనుష్‌, శింబులపై ఆరోపణలు అబద్ధమని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆమె మరోసారి ట్విట్టర్‌ ద్వారా బాంబు పేల్చింది. ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని.. ఇదంతా ఊహాజనితం కాదని చెప్పింది. అయితే సుచిత్ర వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నా.. ఆమె మీడియా ముందుకు వస్తే కానీ ఇందులో ఎంత మేరకు నిజముందో తెలియరాదని సినీ పండితులు అంటున్నారు. కానీ సుచిత్ర భర్త, నటుడు కార్తీ మాత్రం సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారానికి 90 గంటల పని చేయాలా? సన్‌డేను - సన్-డ్యూటీగా మార్చాలా?

పండగ వేళ ప్రయాణికుల నిలువు దోపిడీ!

ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? (Video)

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం