Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో రాజకీయాల్లేవ్.. ఆశీర్వాదం కోసమే వచ్చాం : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రనటుడు పవన్‌ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి.

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (14:06 IST)
జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రనటుడు పవన్‌ కల్యాణ్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కొద్దిసేపు చర్చలు జరిగాయి. 
 
ఆ తర్వాత కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ... పవన్‌తో జరిగిన భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందన్నారు. తన కుమారుడు నిఖిల్‌ సినీరంగ ప్రవేశం గురించి పవన్ కల్యాణ్‌తో చర్చించానని కుమారస్వామి తెలిపారు. నిఖిల్‌ను పవన్‌ సొంత సోదరుడిగా భావిస్తారని ఆశిస్తున్నారన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రజలు అన్నదమ్ముల్లాంటివారని ఆయన అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్‌ ప్రాధాన్యత ఉంటుందని కుమారస్వామి వెల్లడించారు.
 
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు కుమార స్వామికి మధ్య 8 ఏళ్ల నుంచి అనుబంధం ఉందన్నారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ సినీ ప్రవేశం గురించి చర్చించామన్నారు. ప్రత్యేక హోదా అంశంపై తర్వాత మాట్లాడతానని పవన్‌కల్యాణ్‌ చెప్పారు. 
 
కాగా, కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ నటించిన 'జాగ్వార్‌' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments