సినీ నటి కరాటే కళ్యాణి హత్యకు కుట్ర?

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (10:35 IST)
సినీ నటి కరాటే కళ్యాణి హత్యకు ఎవరైనా కుట్ర పన్నారా? అందుకు ఆమె ఔననే సమాధానం ఇస్తున్నారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. తన కారు టైర్లను కోసేశారని, రోడ్డుపై వస్తుండగా టైర్లు పేలిపోయాయని తెలిపారు. ఈ ఘటన హైవేపై జరిగివుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. 
 
కాగా, ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె సినీ కెరియర్‌కే పెను ముప్పుగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించి ఏకంగా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
తనకు ప్రాణహాని వుందని, కొందరు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కారు రెండు  టైర్లను ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని, దాన్ని గుర్తించకుండానే తాను ప్రయాణించాని, రోడ్డుపై వెళుతుండగా కారు టైర్లు పేలిపోయాయని చెప్పారు. ఒకవేళ ఈ ఘటన హైవేపై జరిగువుంటే తన పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. కావాలనే ఎవరో తన కారు టైర్లను కొంచె చేశారని చెప్పారు. అందువల్ల తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments