Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికి తర్వాత "స్పైడర్''పై కన్నేసిన కరణ్ జోహార్..?

బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. స్పైడర్‌పై కన్నేశాడు. బాహుబలిని బాలీవుడ్‌లో ప్రమోట్ చేసి సక్సెస్ అయిన కరణ్ జోహార్.. స్పైడర్ సినిమాను బాలీవుడ్‌లో తన పతాకంపై

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (12:01 IST)
బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. స్పైడర్‌పై కన్నేశాడు. బాహుబలిని బాలీవుడ్‌లో ప్రమోట్ చేసి సక్సెస్ అయిన కరణ్ జోహార్.. స్పైడర్ సినిమాను బాలీవుడ్‌లో తన పతాకంపై విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. బాహుబలిని బాలీవుడ్‌లో విడుదల చేసిన కరణ్ జోహార్.. స్పైడర్‌ను కూడా తమ బ్యానర్‌పై రిలీజ్ చేయడం ద్వారా పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నాడు.
 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేహ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు చెందిన పోస్టర్, టీజర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 'స్పైడర్' టీజర్ ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే 63 లక్షలకు పైగా వ్యూస్‌ను ఈ టీజర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్‌ను చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కరణ్ జోహార్.. బాలీవుడ్‌లో తన పతాకంపై రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. 
 
ఇకపోతే.. మహేష్ బాబు స్పైడర్ చెన్నై షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై శివారు ప్రాంతమైన పూందమల్లి లోని జీ స్టూడియోలో చిత్రీకరించారు. స్పైడర్‌లో చాలావరకు కీలక సన్నివేశాలను చెన్నైలోనే చిత్రీకరించినట్లు సినీ వర్గాల సమాచారం. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments