Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతారా కోవలో కలివీరుడు

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (16:56 IST)
Kaliveerudu- Ekalavya
కె.జి.ఎఫ్ తో కాలరెగరేసిన కన్నడ చిత్రసీమ "కాంతారా"తో తన ప్రతిష్టను మరింత పెంచుకోవడం అందరికీ తెలిసిందే. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. "కలివీర" పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధిస్తూ... రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత సుస్థిరం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు "కలివీరుడు"గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని... "మినిమం గ్యారంటీ మూవీస్" పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. "అవి" దర్శకత్వంలో... రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. "కాంతారా" కోవలో "కలివీరుడు" తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments