Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె నాట్యం.. అందానికి ఫిదా అయిన రాజమౌళి... అందుకే బాహుబలిలో ఛాన్స్.. ఎవరామె? (Audio Song)

ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు తిరగరాస్తున్న చిత్రం బాహుబలి 2. భారతీయ చలన చిత్రపరిశ్రమకే మణిహారంగా నిలిచిన ఈ చిత్రంలో ఇంతకముందెన్నడూ వెండితెరపై కనిపించని ఓ నాట్యకారిణికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమ

Webdunia
సోమవారం, 22 మే 2017 (14:40 IST)
ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు తిరగరాస్తున్న చిత్రం బాహుబలి 2. భారతీయ చలన చిత్రపరిశ్రమకే మణిహారంగా నిలిచిన ఈ చిత్రంలో ఇంతకముందెన్నడూ వెండితెరపై కనిపించని ఓ నాట్యకారిణికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో ‘‘కన్నా నిదురించరా... నా కన్నా నిదురించరా’’ అనుష్కతో కలిసి ఓ అందమైన మహిళ నాట్యం చేసింది. తనదైన అభినయంతో మెప్పించి ప్రేక్షకుల మదిలో ఎవరీ అమ్మాయి అనే ప్రశ్నను రేకెత్తేలా చేసింది. ఆమె ఎవరో తెలుసా.. అశ్రిత వేముగంటి. ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి నాట్యకారిణిగా గుర్తింపు వుంది. ఆమెకు రాజమౌళి ఎలా అవకాశం ఇచ్చారన్నదే కదా మీ సందేహం.
 
గత 2013లో ఓ సినిమా ఆడియో వేడుకలో ఈమె సెమీ క్లాసికల్ డ్యాన్స్‌‌తో అశ్రిత ఆహుతులను మెప్పించింది. ఆ ఆడియో వేడుకకు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అపుడు ఆమె చేసిన నాట్యానికి రాజమౌళితో పాటు.. ఆయన కుటుంబమంతా ఫిదా అయిపోయింది. ఒక నెల తర్వాత రాజమౌళి కొడుకు కార్తికేయ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉందా? అని కార్తికేయ అడిగాడు. ఆమె సమ్మతం తెలుపడంతో బాహుబలిలో నటించే గోల్డెన్ చాన్స్ దక్కింది. అంతేకాదు, ఈమె పలు టీవీ చానల్స్‌లో యాంకర్‌గా కూడా మెప్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments